వినాయక చవితి వేడుకలు ఉమ్మడి జిల్లాలో వైభవంగా జరుపుకొంటున్నారు. జిల్లా కేంద్రాలతోపాటు గ్రామాల్లో గణనాథుడి విగ్రహాలు అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరాయి.
ఈ సందర్భంగా భక్తులు, మండపాల నిర్వాహకులు వినాయకుడి విగ్రహాలను అందంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు, హోమం, భజన కార్యక్రమాలు చేపడుతున్నారు. పలుచోట్ల మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు.