ధర్పల్లి/నిజామాబాద్‌రూరల్/సిరికొండ /ఇందల్వాయి, ఫిబ్రవరి 17: ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుట్టిన రోజు వేడుకలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో కేక్‌లు కట్ చేసి బాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీస్ రాజ్‌పాల్‌రెడ్డి, నాయకులు జీయర్ కిశోర్‌రెడ్డి, ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు శేఖర్, లింబ్యా, రాజేశ్, భూమేశ్, శంకర్, మనోహర్‌రెడ్డి, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
ఆర్టీసీ చైర్మన్‌కు ప్రజాప్రతినిధులు సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, సొసైటీ చైర్మన్లు చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, నిమ్మల మోహన్‌రెడ్డి, గజవాడ జైపాల్గుప్తా, గంగారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని శాస్త్రీనగర్‌లో ఉన్న నిర్మల వృద్ధాశ్రమంలో రూరల్ జడ్పీటీసీ సభ్యురాలు బొల్లెంక సుమలతా గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బాజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ కేక్ కట్ చేశారు. వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. సారంగాపూర్‌లో బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎండీ అక్బర్ నవాజుద్దీన్ ఆధ్వర్యంలో 100 మందికి గోడ గడియారాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రూ.70 వేల విలువ చేసే బ్యాగులు, పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేయగా జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, కోర్వ దేవేందర్పాటు ప్రజాప్రతినిధులు రక్తదానం చేశారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్.. బాజిరెడ్డి గోవర్ధణ్కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సిరికొండ మండలం చీమన్‌పల్లిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలో, సిరికొండలో జాగృతి ఆధ్వర్యంలో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టలు, జామెట్రీ బాక్స్‌లు అందజేశారు. కొండూర్ బ్రిడ్జిపై హ్యాపీ బర్త్ డే కేసీఆర్, గోవన్న ఆంగ్ల అక్షరాల ప్లకార్డులతో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకున్నది. తాళ్లరామడుగులో పులింటి రంజిత్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో పండ్లు పంపిణీ చేశారు.
ఉచిత దంత వైద్యశిబిరం
మోపాల్ (ఖలీల్‌వాడి), ఫిబ్రవరి 14 : మోపాల్ మండలంలోని బోర్గాం(పీ) గ్రామంలో బాజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దంత వైద్యనిపుణుడు డాక్టర్ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్లో దంత వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు.
కేరళలో సీఎం, ఆర్టీసీ చైర్మన్ జన్మదిన వేడుకలు
డిచ్పల్లి, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. సీఎం, ఆర్టీసీ చైర్మన్ పేర్లపై అర్చనలు, పూజలు చేయించారు. ఆలయ ప్రాంగణంలో కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకుడు దాసరి లక్ష్మీనారాయణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సాయిలు, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు రాథోడ్ వినాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నీరడి పద్మారావు, విండో డైరెక్టర్ సతీశ్‌రెడ్డి, సీనియర్ నాయకులు పోతర్ల రవి, రామకృష్ణ, అంబటి రాథోడ్, సురేశ్, కిషన్, రవీందర్‌రెడ్డి, వినోద్, సురేందర్ పాల్గొన్నారు.
క్రీడాకారుల ఆధ్వర్యంలో ..
ఇందల్వాయి, ఫిబ్రవరి17 : మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన సీనియర్ త్రోబాల్ క్రీడాకారులు కేరళలోని ఎర్నాకులంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు అరవింద్, దిలీప్, రాకేశ్, రాజేశ్, కె.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.