Purchase center | బిబిపేట్, మే10 : బిబిపేట్ మండలంలోని తుజాల్ పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని శనివారం రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, తరలించిన ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం లేదని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వెంటనే ధాన్యం లారీలను తీసుకొచ్చి కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. అలాగే అధికారులతో రైతులను మాట్లాడించి ఆందోళన విరమింపజేశారు.