బాన్సువాడ రూరల్/ నస్రుల్లాబాద్/ ఎల్లారెడ్డి రూరల్/ రామారెడ్డి, జూన్ 7: ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామంలో ఉపాధ్యాయులు శుక్రవారం ఇం టింటికీ తిరుగుతూ బడిఈడు పిల్లలతోపాటు బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నక్క ప్రవీణ్, రవిశంకర్, మంజుల తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండలకేంద్రంతోపాటు మైలారం, బొమ్మన్దేవ్పల్లి, దుర్కి, అంకోల్ తదితర గ్రామాల్లో ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించుట, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు హన్మాండ్లు, ఉపాధ్యాయులు ఇందిర, రుక్మిణి, అంగన్వాడీ టీచర్ గంగామణి తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం వేలాది రూపాయలను వెచ్చించి, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సౌకర్యాలను కల్పిస్తున్నదని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వనాథం, ఉమాదేవి, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, జన్నూబాయి తదితరులుపాల్గొన్నారు.
రామారెడ్డి మండలంలోని మోషంపూర్, పోసానిపేట్ తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగభూషణం, సంగమేశ్వర్, విజయ, నరేందర్, సీఆర్పీ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.