Nizamabad | కంటేశ్వర్, నవంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (కలెక్టరేట్)కు శనివారం విచ్చేసిన బోధన్ శాసన సభ్యులు పీ సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికారు. పూల మొక్కలు అందించి శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి సూచించారు. కాగా, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్, స్వామి, శ్రీవేణి, టిఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్, వివిధ శాఖల మహిళా ఉద్యోగ సోదరీమణులు, ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రశాంత్, శ్రీనివాస్, ప్రభు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.