నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 10 : శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుక లను వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండ లాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొని కేక్‌లు కట్ చేశారు. వర్ని మండల కేంద్రంలో, చందూర్ మండలం మేడ్పల్లిలో స్పీకర్ పోచారం కేక్ కట్ చేశారు. కోటగిరిలో నాయకులు అన్నదానం చేశారు. వర్ని మండలకేంద్రానికి చెందిన జాస్తి శివనాగేశ్వరరావు అమెరికాలో స్పీకర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి సమానులైన పోచారం శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో ఉండాలని మంత్రి వేముల కోరుకున్నారు.