వైభవంగా గోదాదేవి కల్యాణోత్సవం
బీ ర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం, బాన్సువాడ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భోగి పండుగను పురస్కరించుకొని ధనుర్మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి క ల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- హాజరైన సభాపతి పోచారం దంపతులు
- స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించిన స్పీకర్
బీర్కూర్/బాన్సువాడ టౌన్, జనవరి 14: బీ ర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం, బాన్సువాడ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భోగి పండుగను పురస్కరించుకొని ధనుర్మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి క ల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు హాజరయ్యారు. తెలంగాణ తిరు మల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి సభాపతి పట్టువస్ర్తాలు సమర్పించారు. 38 మంది జం టలతో వేంకటేశ్వర స్వామి కల్యాణం జరిపించగా.. ఆలయ ధర్మకర్తలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం శంభురెడ్డి దంపతులు పాల్గొన్నారు. బోధన్కు చెందిన వేగిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దేవుడు అంతటా ఉన్నాడు : పోచారం
బాన్సువాడ వేంకటేశ్వరాలయంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మనస్ఫూర్తిగా దేవుడిని కొలిస్తే ప్రతిచోటా ఉంటాడని అన్నారు. నిర్మలమైన మనసున్న ప్రతి హృదయం దేవుడి నివాసమే అని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ దేవుడి సేవతోపాటు సామాజిక సేవ చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే వేద పండితుల కోసం నిర్మిస్తున్న ఆచార్య గృహం కోసం రూ. 15 లక్షల నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఆలయ కమిటీ వినతి మేరకు అన్నదాన సత్రం కోసం మరో రూ.15 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు ద్రోణవల్లి సతీశ్, ద్రోణవల్లి అశోక్, మద్దినేని నాగేశ్వర్రావు, అప్పారావు, నర్సరాజు, ఏరువాక కృష్ణారెడ్డి, కర్ణకంటి వీరయ్య, మేనేజర్ విఠల్, అర్చకులు నందకిశోర్, అభిషేక్ శాస్త్రి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, మండల నాయకుడు దోడ్ల నీరజా వెంకట్రాం రెడ్డి, మాజీ ఎంపీపీ ఎజాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ గుప్తా, కో-ఆప్షన్ సభ్యుడు బాబా, కౌన్సిలర్లు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

