నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా పాల్గొన్నారు. పావురాన్ని ఎగురవేసి కేక్ కట్ చేశారు. విద్యార్థులు బెలూన్లను ప్రదర్శించి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల్లో భాగంగా సిరికొండ ఎంపీపీ మలావత్ సంగీతారాజేందర్ మండల పరిషత్ కార్యాలయంలోకేక్ కట్ చేశారు. జడ్పీటీసీ మాన్సింగ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ తోట రాజన్న, సర్పంచ్ ఎన్నం రాజిరెడ్డి, రాజకిషన్, మహేందర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ప్రజాప్రతినిధులు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, వైస్ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంకు టీఎస్పీఆర్టీయూ నాయకులు పుస్తకాలను అందజేశారు. సిరాజుద్దీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆర్మూర్‌లోని కాశీ హనుమాన్ ఆలయం వద్ద కౌన్సిలర్ తాటి హన్మాండ్లు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పండ్లను పంపిణీ చేశారు. మాక్లూర్ మండలంలోని కల్లడి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లోని విద్యార్థులకు వైస్ ఎంపీపీ సుక్కి సుజాత, విండో వైస్ చైర్మన్ రమేశ్, నాయకుల ఆధ్వర్యంలో పండ్లు, పలకలు, నోటు బుక్కులను పంపిణీ చేశారు. నందిపేట్‌లోని నందిగుడి కల్యాణ మండపంలో ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మచ్చర్ల సాగర్ తదితరులు కేక్ చేసి అన్నదానం చేశారు. బాల్కొండలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో 32 పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.
రెంజల్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. వేల్పూర్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో వంద మంది రక్తదానం చేశారు. ఆర్టీఏ సభ్యుడు రేగుళ్ల రాములు, పార్టీ మండల అధ్యక్షుడు నాగధర్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్‌లోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. బోధన్ మండలంలోని జాడిజమాల్‌పూర్ గ్రామంలో ఉన్న వృద్ధాశ్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్ ఆధ్వర్యంలో కేట్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. మొక్కలు నాటి సర్వమత ప్రార్థనలు చేశారు. భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్‌లో అన్నదాన కార్యక్రమాన్ని జడ్పీటీసీ చౌట్పల్లి రవి, పార్టీ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య ప్రారంభించారు. నవీపేట మండలంలోని మోకన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ రొడ్డ సుధాకర్, ఉపసర్పంచ్ సురేశ్ తదితరులు పండ్లను పంపిణీ చేశారు.