డిచ్పల్లి/నిజామాబాద్ రూరల్/ ఖలీల్‌వాడి (మోపాల్)/ఇందల్వాయి/ధర్పల్లి/సిరికొండ/ జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడు కలను నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతి నిధులు, టీఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు, బాజిరెడ్డి అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. బాజిరెడ్డి 68వ జన్మదినం సందర్భంగా డిచ్పల్లి మండలం మల్లాపూర్ ఉప సర్పంచ్ ప్రత్యేకంగా 68 కిలోల కేక్‌ను తయారు చేయించారు. తన ఇం టి ఆవరణలో బాజిరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య కేక్‌కట్‌చేశారు.
సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో బాజి రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ యూనివ ర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో టీఆర్ఎస్వీ, విద్యార్థి జేఏసీ, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడు కలకు ముఖ్య అతిథులుగా వీసీ రవీందర్, రిజి స్ట్రా ర్ శివశంకర్, పాలకమండలి సభ్యులు మారయ్య గౌడ్, రవీందర్ హాజరై కేక్‌కట్ చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కమ్మ సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షుడు కలగర శ్రీనివాసరావు బాజిరెడ్డికి జన్మది న శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీ సీ దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. వారిమధ్య బాజిరెడ్డి కేక్ కట్ చేశారు.
నియోజకవర్గంలోని సహకార సొసైటీల చైర్మ న్లు, డీసీసీబీ డైరెక్టర్ బాజిరెడ్డిని ఘనంగా సన్మా నించారు. డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డీసీసీబీ డైరెక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి, లింగన్న, ఆనంద్‌తోపాటు విండో చైర్మన్లు గోవర్ధన్‌రెడ్డి, చింత శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తారాచంద్ తదితరు లు బాజిరెడ్డిని ఆయన నివాసంలో కలిసి శుభా కాంక్షలు తెలిపారు. ధర్పల్లి మండల ప్రజా ప్రతిని ధులు, నాయకులు రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీస్రాజ్పాల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామునే జిల్లా కేంద్రంలోని బాజిరెడ్డి ఇంటికి చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
సిరికొండ మండలం చీమన్‌పల్లి గుడిపేట శివాలయంలో సర్పంచ్ పద్మశివారెడ్డి ఆధ్వర్యం లో అన్నదానం చేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యం లో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతుబంధు సమితి ఆధ్వ ర్యంలో రైతువేదికలో కేక్ కట్ చేశారు. రావుట్లలో శివసాయి మల్టీ స్పెషాలిటీ దవా ఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇంద ల్వాయి మండల కేంద్రంలో బాజిరెడ్డి గోవర్ధ న్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట బాజిరెడ్డి గోవర్ధన్ భారీ కేక్ కట్‌చేశారు. ఎంపీపీ రమేశ్‌నాయక్ ఆధ్వర్యంలో నాయకులు బాజిరెడ్డి ని ఘనంగా సన్మానించారు. జక్రాన్‌పల్లి మండ లంలో కేసీఆర్, బాజిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు. టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు. గ్రామాల్లో విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. సారం గాపూర్లోని తెలంగాణ యూనివర్సిటీ కళాశాలలో అధ్యాపకులు మొక్కలునాటారు. మోపాల్ మండ ల నాయకులు బాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.