బీబీపేట్ (దోమకొండ), నవంబర్ 22 : దోమకొండ మండలంలో గంజాయి దందా జోరుగా సాగుతున్నది. దోమకొండ మండలకేంద్రంతోపాటు అంచనూర్, ముత్యంపేట తదితర గ్రామాల్లో గంజాయి విక్రయిస్తుండడంతో యువకులు మత్తుకు బానిసలవుతున్నారు. దోమకొండ గ్రామ శివారులోని(గుండ్ల చెరువు) మినీ స్టేడియం సమీపంలో, పలుగడ్డ బహిరంగ ప్రదేశం, దోమకొండ-అంబారీపేటకు వెళ్లే రోడ్డులో రాత్రి సమయంలో యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు సమాచారం.
మత్తు పదార్థాలకు బానిసైన యువత ఆ మత్తులో తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నాయి. దోమకొండ, అంచనూర్, ముత్యంపేట తదితర గ్రామాల శివారులో పార్టీల పేరుతో గంజాయి తాగుతున్నట్లు సమాచారం. ఇటీవల రెండు ఘటనల్లో యువకులు గంజాయితో పట్టుబడ్డా.. పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేకోవద్దన్నారు. గంజాయిపై గ్రామాల్లో యువతకు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం.
– సంపత్‌కుమార్, సీఐ, భిక్కనూర్