వినాయక్‌నగర్, నవంబర్ 10: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో 4.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి సూచనలు, సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ బృందం తనిఖీలు చేపట్టింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి మాధవనగర్ వచ్చే మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.
బైక్‌పై, ఆటో రిక్షాలో ఇద్దరు గంజాయి తరలిస్తుండగా ఒక్కరు మాత్రమే పట్టుబడగా, మరో నిందితుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. నగరంలోని అసద్ బాబా నగర్‌కు చెందిన సర్పరాజ్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, 2.1 కిలోల గంజాయి, పల్సర్ బైక్‌ను సీజ్ చేశారు. నగరంలోని ద్వారకానగర్‌కు చెందిన సాజిత్ అలీ అనే మరో వ్యక్తి తన ఆటో రిక్షా వదిలేసి పారిపోగా.. ఆటోలో తనిఖీ చేయగా అందులో 2.1 కిలోల గంజాయి లభించిందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నిందితులు మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణం నుంచి గం జాయి కొనుగొలు చేసి నిజామాబాద్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలినట్లు ఎస్‌హెచ్‌వో దిలీప్ తెలిపారు. కేసు నమోదు చేసి,రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దాడిలో ఎస్సై మల్లేశ్, సిబ్బంది షబ్బీర్, ప్రభాకర్, దార్సింగ్, రవి, సంగయ్య, సౌమ్య పాల్గొన్నారు.