ఆర్మూర్‌టౌన్/ మాక్లూర్, సెప్టెంబర్18: వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేకున్నది. మాక్లూర్ మండలం మానిక్‌బండార్‌లో డీజే సౌండ్‌కు గుండెపోటు వచ్చి ఓ యువకుడు మృతి చెందగా.. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో వినాయక విగ్రహం మీదపడి మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాక్లూర్ మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఊరడి మధు (27) మంగళవారం సాయంత్రం మానిక్‌బండార్‌లో హిందూ సేన యువజన గణేశ్ మండలివారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం తరలించడానికి తన ట్రాక్టర్ తీసుకొని వచ్చాడు.
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రామాలయానికి చేరుకోగా..ఉదయం మూడు గంటల ప్రాంతంలో మధు ఆలయ ఆవరణలో నిద్రించాడు. ఉదయం 8 గంటల సమయంలో గణేశ్ మండలి సభ్యులు అతడిని నిద్రలేపడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గుండెపోటుతో మృతిచెందినట్లు ఎస్సై అనుమానం వ్యక్తంచేయగా.. కుటుంబ సభ్యులు మాత్రం డీజే సౌండ్‌తో గుండెపోటు వచ్చి మృతిచెందాడని పేర్కొన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన యువసేన యూత్ సభ్యులు వినాయక విగ్రహాన్ని క్రేన్ సాయంతో పైకిలేపుతున్న సమయంలో విగ్రహం జారిపడడంతో అక్కడే ఉన్న మహేశ్ అనే యువకుడిపై పడడంతో చేయి విరిగింది. యూత్ సభ్యులు హుటాహుటిన దవాఖానకు తరలించారు. క్రేన్ సాయంతో విగ్రహాలను నీళ్లలో ఒకేచోట వేయడంతో అవి మునగడంలేదని మండపాల నిర్వాహకులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది అందుబాటులో కూడాలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.