Renjal | రెంజల్, సెప్టెంబర్ 6 : రెంజల్ మండలంలోని రెంజల్, తాడుబిలోలి, ఇతర గ్రామాల్లో శనివారం గణేష్ నిమజ్జనం శోభా యాత్ర భక్తి పాటలు పడుతూ యువకుల నృత్యాల మధ్య ముందుకు సాగింది. రెంజల్ లో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ గణనాథుడికి పూజలు నిర్వహించి, ఊరేగింపు రథారథాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పు సంతోష్ మాట్లాడుతూ.. ఐకమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలు ఇలాంటి పండుగలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు.