మాచారెడ్డి, నవంబర్ 9 : రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి ట్రస్టు హాస్టల్ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు కోరారు. కామారెడ్డి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్బీవీఆర్ఆర్ ట్రస్టు వసతిగృహం కోసం కామారెడ్డి శివారులో ప్రభుత్వం ఇప్పటికే ఐదెకరాల స్థలం కేటాయించిందని, భవన నిర్మాణానికి మరో రూ.10 కోట్ల నిధులు ఇవ్వాలని కేసీఆర్‌కు విన్నవించారు. ఇందుకు సానూకులంగా స్పందించిన సీఎం.. నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యనిర్వహణ అధ్యక్షుడు జూకంటి మోహన్‌రెడ్డి, మాచారెడ్డి జడ్పీటీసీ మినూకూరి రాంరెడ్డి, తిర్మల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, భీంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, గంగారెడ్డి, గోవింద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి, నవంబర్ 9 : బీఆర్ఎస్ పాలన బాగుంది. సంక్షేమ పథకాలు, వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఇందుకు నిదర్శనం. తక్కువ కాలంలో రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. అలాంటి నాయకుడి పాలన కొనసాగాలి.
వేరే పార్టీల వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా, మాయమాటలు చెప్పినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ. రేవంత్‌రెడ్డి లాంటివారు వందమంది వచ్చినా తరిమి కొడ తాం. గరీబోళ్లు బాగుండాలంటే కేసీఆర్ సార్‌ను గెలిపించుకోవాలి.
సీఎం చెప్పేది వినేందుకు వచ్చిన..సీఎం కేసీఆర్ సార్ మాట్లాడేది, ఆయన చెప్పేది వినడానికి మీటింగ్‌కు వచ్చిన. కామారెడ్డికి ఇప్పటిదాకా ఏంచేశారో పూసగుచ్చినట్లు చెప్పిండు. ఇంకా ఏం ఇస్తడో కూడా చెప్పిండు. కేసీఆర్‌ను గెలిపించుకుంటే మా జిల్లా మొత్తం ఇంకా బాగైతది.
ముసలోళ్లకు, కాళ్లు చేతులు సరిగా లేనోళ్లకు బీఆర్ఎస్ సర్కారు మస్తు పింఛన్ ఇస్తున్నది. మళ్లీ గెలిస్తే ఇంకా పెంచుతమంటున్నడు కేసీఆర్ సార్. ఆయన ఇచ్చిన మాట తప్పడు. బీఆర్ఎస్ మా ఇంటిపార్టీ. వేరోళ్లను దగ్గరికి రానియ్యం.
-ఉమాకళ, రామారెడ్డి మండలం
సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకం. పదేండ్లళ్ల మస్తు పనులు చేసిండ్రు. బీదోళ్లను ఆదుకున్నరు. ఇంకా కొత్తకొత్త పథకాలు తెస్తమంటున్నరు. కేసీఆర్ హామీ ఇచ్చిండంటే.. తప్పకుండా నెరవేరుస్తడు. గులాబీ పార్టీనే మళ్లీ గెలవాలె.
–
మా గిరిజనులు ఎప్పటినుంచో ఆశ పెట్టుకున్న పోడు భూములకు కేసీఆర్ సార్ పట్టాలు ఇచ్చిండు. తండాలను పంచాయతీలు చేసిండు. ఆయన మేలును మర్చిపోము. మమ్మల్ని, మా బాధల్ని కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదు.
బీఆర్ఎస్.. రైతుల ప్రభుత్వం. పెట్టుబడి సాయం ఇస్తున్నది. ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నది. కష్టపడి పండించిన పంటను కూడా సర్కారే కొంటున్నది. పైసా తీసుకోకుండా రూ. 5లక్షల రైతుబీమా చేయించి మా కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. రైతుకు ఇంతకన్నా ఏం గావాలె. కేసీఆర్‌నే మళ్లీ గెలిపించుకుంటం.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. ఆయన పాలన అద్భుతం. పట్టుదలతో పదేండ్లలోనే తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో మొదటి స్థానంలో నిలబెట్టారు. రాష్ర్టానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి.