Free eye medical camp | కామారెడ్డి రూరల్, జనవరి 2 : కామారెడ్డి మండలంలోని పీఎంశ్రీ చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలోని 6 నుండి పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం ఆధ్వర్యంలో శుక్రవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆర్బిఎస్కే మెడికల్ నేత్ర వైద్యులు రవీందర్, డాక్టర్ సంతోష్, సిబ్బంది విద్యార్థులను పరీక్షించి విటమిన్ ఏ ఆవశ్యకత వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మందులు అందజేశారు. ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన మెల్లకన్ను ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్ కోసం రెఫర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి, ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, ప్రభాకర్, ఉమాదేవి, రాజ్యలక్ష్మి, సుశీల, రామకృష్ణ, రవి, స్వప్న, నర్సిరెడ్డి, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.