నిర్లక్ష్యానికి నలుగురి బలి
ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఏడుగురు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
- గన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- అదుపు తప్పి బోల్తా కొట్టిన ప్రైవేట్ బస్సు
- నలుగురు మృత్యువాత.. పలువురికి గాయాలు
- డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణం
ధర్పల్లి(ఇందల్వాయి)/ఖలీల్వాడి, మార్చి 13: ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఏడుగురు తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

డిచ్పల్లి సీఐ వినోద్, బాధితుల కథనం మేరకు.. ఖురానా ట్రావెల్స్కు చెందిన బస్సు గురువారం రాత్రి 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు బయల్దేరింది. ఇందల్వాయి సమీపంలోని గన్నారం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి రాయిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన తల్లి, కుమారుడు మంజూష (32), రిషి (7), బెంగళూరుకు చెందిన అబ్బాస్ (35) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో నడపడం వల్లే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు. డ్రైవర్ నిద్రపోతున్నట్లు గుర్తించి తాము అప్రమత్తం చేశామని, అయినప్పటికీ అలాగే నడిపి యాక్సిడెంట్ చేశారని వాపోయారు. ప్రమాదంలో భార్య, బిడ్డను కోల్పోయిన బాధితుడు లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

