నిజామాబాద్ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల మాజీ జెడ్పీటీసీ గుళ్లే రాజేశ్వర్తో పాటు కాంగ్రెస్ నాయకుడు, వీడీసీ ఉపాధ్యక్షుడు అరుణ్ యాదవ్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజపూర్ణనంద మాజీ ఎంపీపీ కొలిపాక ఉపేందర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్స్ పెదకాపుల శ్రీనివాస్ రెడ్డి, బర్మా చిన్న నర్సయ్య, మాజీ ఎంపిటిసి జక్కని మధు, కొలిపాక శ్రీనివాస్, బద్దం ప్రభాకర్, బద్దం హన్మాండ్లు, గడ్డం రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.