ఖలీల్‌వాడి, మార్చి 18:బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలకు పెద్దపీట వేశామని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయిలో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డలకు రూ.లక్ష నగదు సాయం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. అంతేకాకుండా ముస్లిం సోదరులకు ప్రతి రంజాన్ పండుగకూ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడంతో పాటు తోఫాలను అందించిన కేసీఆర్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. గత 50 ఏండ్ల చరిత్రను తిరగరాసి, తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్‌దని కొనియాడారు. ఎస్సీ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కుమార్, మాజీ ఎంపీపీ రమేశ్‌నాయక్, చంద్రాయన్పల్లి సర్పంచ్ చింతల దాసు, సుధాకర్, రాజేందర్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలం మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు సాంసొద్దీన్ బుధవారం బీఆర్ఎస్లో చేరారు. బాజిరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.