పిట్లం/ ఎల్లారెడ్డి/ లింగంపేట/ నిజాంసాగర్/ రామారెడ్డి/ సదాశివనగర్, మార్చి 11: కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే గ్రామీ ణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని పిట్లం మాజీ ఎంపీపీ రజినీకాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని బండపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లోని తాగునీరు, విద్యుత్, రహదారుల సమస్యలు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తీరాయన్నారు. సీసీ రోడ్ల ఏర్పాటుతో కాలనీల్లో రహదారుల సమస్య తొలిగిపోయిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యమ్మ, ఉపసర్పంచ్ రాజు, ఎంపీటీసీ నారాయణ, విండో వైస్ చైర్మన్ పుట్టి రాములు, వార్డు సభ్యులు శోభన, లక్ష్మణ్, శ్రీకాంత్, సాయిలు, రవి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుంటి రాములు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గంట సాయిలు, కల్యాణి గ్రామంలో సర్పంచ్ రఘువీర్‌గౌడ్ ప్రారంభించారు. రూ.ఐదు లక్షల వ్యయంతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వెల్లుట్లలో పీఏసీఎస్ చైర్మన్ పటేల్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే సురేందర్ రూ.ఐదు లక్షల నిధులను మంజూరు చేయించడంతో పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మాజీ వైస్ ఎంపీపీ నీరడి సంగమేశ్వ ర్, వీడీసీ చైర్మన్ మల్లయ్య, నాయకులు దత్తు, సంద బా లయ్య, అంజయ్య, హరీశ్, కాశీరాం, అంజయ్య, అల్లూ రి, సంగాగౌడ్, అనిల్, అంజవ్వ, సంగయ్య పాల్గొన్నారు.
రామారెడ్డిలోని 11వ వార్డులో రూ.ఐదు లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సర్పంచ్ సంజీవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సురేందర్ నిధులను మంజూ రు చేయించారని తెలిపారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భానూరి నర్సారెడ్డి, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, రజిత, వార్డు మెంబర్ సుంకోజి గంగాధర్, పార్టీ నాయకుడు తుపాకుల రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ చంద్రాబాయి, ఎంపీటీసీ హీరాబాయి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తన నియోజకవర్గ నిధులను మంజూరు చేయడంతో సీసీ రోడ్డును వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వారితో పాటు నాయకులు శ్రావణ్జాదవ్, శంకర్రావు, నారాయణరావు, నాందేవ్పటేల్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
సదాశివనగర్ మండలంలోని వజ్జపల్లిలో రూ.ఐదు లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నర్సింహులు, సర్పంచ్ ఎర్రం నర్సయ్య ప్రారంభించారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రభాకర్ రావు, ఎంపీటీసీ రాంచందర్ రావు, ఏఎంసీ డైరెక్టర్ రామారావు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శ్యాంరావు, మహిపాల్, లస్మయ్య తదితరులు పాల్గొన్నారు.