బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, పార్టీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచే వారిని గుర్తించి, వారికే అవకాశం ఇవ్వాలని సూచించారు.
కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్యాసం సన్నగిల్లుతున్నదని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కోసం కష్టపడ్డ వారికే గుర్తింపు ఉంటుందన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, గాంధారి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు, శట్పల్లి సంగారెడ్డి విండో చైర్మన్ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
– ఎల్లారెడ్డిరూరల్/నాగిరెడ్డిపేట/లింగపేట్, ఫిబ్రవరి11