నిజామాబాద్ జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.
ఉదయం 10 గంటలకు వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్తూపానికి నివాళి, 10.30 గంటలకు పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం, అనంతరం అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు నివాళి, రక్తదాన శిబిరం, ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.