రామారెడ్డి (సదాశివనగర్), అక్టోబర్ 9: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి మహిళలు, వృద్ధులను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన ఝూటా సీఎం రేవంత్‌రెడ్డికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఈ బాకీ కార్డును చూపించి నిలదీయాలని కోరారు. తమకు అందాల్సిన పథకాలను అమలుచేసిన తర్వాతే ఓట్లు అడగాలని ప్రశ్నించాలని వారికి సూచించారు. బీఆర్ఎస్ నాయకులు బుచ్చన్న, కలాలీ సాయాగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.