బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోసుపల్లి గ్రామం తెలంగాణ ఉపపీఠంలో నిర్వహిస్తున్న సమస్య మార్గదర్శన్ కార్యక్రమంలో నరేంద్ర మహారాజ్ (Jagadguru Narendra Maharaj) భక్తులకు సందేశాన్ని అందించారు. జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ( Hanmanth Shinde ) కార్యక్రమంలో పాల్గొని స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్నారు.
నరేంద్ర మహారాజ్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలన్నారు. ప్రజల మధ్య అసమానతలు తొలగించడానికి సర్వ మతాలకు దేవుడు ఒక్కడే అని ఉపదేశించారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవ స్వరూపాలని, తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. అనంతరం ఉపపీఠం ప్రాంగణంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు బొల్లి గంగాధర్, నరేందర్ సేట్, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.