ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 6: గడిచిన రెండేండ్లకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నగరంలో చేసింది ఏమీలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా నగర అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన నగరంలోని 6, 22, 23, 30, 31,45డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. ప్రజలు కేసీఆర్‌పై కోపంతో తనను ఓడించలేదన్నారు. రేవంత్‌రెడ్డి అబద్ధపు మాటలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయారన్నారు. రేవంత్‌రెడ్డి కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు.
ఎల్లమ్మగుట్టలో అద్దంలాంటి రోడ్డు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. బీజేపీకి చెందిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగరాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూసే నీచ రాజకీయం ఆ పార్టీదన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు. ప్రచారం కార్యక్రమంలో 20, 21వ డివిజన్ల బీఆర్ఎస్ అభ్యర్థులు పెంచాల శ్రీలత శ్రీనివాస్ డాక్టర్ దండు రుషిత, మాజీ మేయర్ దండు నీతూకిరణ్, ఉమారాణి శ్రీనివాస్, మాకు విజయలక్ష్మీ రవి, కొత్త హరిత అఖిల్, తోట మౌనిక శివకుమార్, మహ్మద్ హఫీజ్, ఆస్మిన్ బేగం జావేద్, ఇర్పాన్, అబ్దుల్ మతీన్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ శేహజాద్ నాయకులు పాల్గొన్నారు.