Hanmanth Shinde | బిచ్కుంద, జూన్ 23 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే హన్మoత్ షిండేను మంగళవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, తాడ్వాయి మండలంలో యూరియా సమస్యపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే బీఆర్ఎస్ నాయకుల మహా ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను హరించే ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై పోరాడే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.