మోర్తాడ్, జూన్ 22: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఆదివారం 2,049 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1063.50 అడుగుల (14.229టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది.
ప్రాజెక్ట్ నుంచి 599 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొన సాగుతున్నదని పేర్కొన్నారు. ఇందులో 100 క్యూసెక్కులు కాకతీయ కాలువకు, 231 క్యూసెక్కులు మిషన్‌భగీరథకు విడుదల చేస్తుండగా, 268 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్తున్నది.