రెంజల్, ఆగస్టు 24 : రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారంలో తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లడంతో దిగువున గల కందకుర్తి గోదావరి నది ఉదృతంగా ప్రవహించింది. గతనాలుగైదు రోజులుగా వర్షాలు శాంతించడంతో గోదావరి నదిలోని వరద ఉధృతి క్రమంగా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో గోదావరి నదిలోని పురాతన శివాలయం నీట మునిగి ఉంది. కాగా శిఖరం మొదటి అంచు మాత్రమే సందర్శకులకు దర్శనమిస్తోంది. వరద ప్రవాహానికి నది తీరాన గల పుష్కర ఘాటు వద్ద బంకమట్టి చేరుకోవడంతో పర్వదినాల్లో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.