Financial assistance | పోతంగల్ అక్టోబర్ 18: సామాజిక సేవాకర్త, మండల బీఆర్ఎస్ నాయకుడు ఎంఏ హకీం స్థానిక నాయకులతో కలిసి శనివారం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన ఒడ్డెర సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక పోవడంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్ సామాజిక సేవాకర్త హకీంకు సమాచారమిచ్చారు.
ఈ మేరకు హకీం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరుపేదలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకుడు సమీర్, పాబ్బ శేఖర్, పగాల నవీన్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.