అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు మారిందీ రైతుల పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన పంట రుణాల మాఫీ జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్నటి వరకు రూ.లక్షలోపు రుణమాఫీ కాని రైతులు తిరిగితే.. ప్రస్తుతం రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీకాని వారు చక్కర్లు కొడుతున్నారు. తీసుకున్న రుణాలను ఏటా రెన్యువల్ చేసుకుంటున్నప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయాధికారుల వద్ద ప్రభుత్వ ప్రత్యేక వెబ్సైట్లో పరిశీలిస్తే నో ఫీడింగ్..అని చూపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఇది బ్యాంకర్ల తప్పిదమా? లేక ప్రభుత్వమే సరైన సమాచారం సేకరించలేదా అనే సందేహాలను వ్యక్తంచేస్తున్నారు.
– గాంధారి/పొతంగల్, ఆగస్టు 4
మా ఊరిలోని కెనరా బ్యాంకు లో రూ.70వేల పంట రుణం తీసుకున్నా. రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. ఎందుకు రాలే దో అర్థంకావడం లేదు. బ్యాం కులో ఉన్న పంట రుణాన్ని 2021లో రెన్యువల్ చేసిన. అయినా లిస్టులో పేరు లేదు. రెండో విడుత రూ.లక్షన్నర మాఫీ జాబితాలో అయినా వస్తుందని అనుకున్న.. అందులో కూడా రాలేదు. నాలాగే మా ఊళ్లో చాలా మంది రైతులు మాఫీ కాలేదని బాధ పడుతున్నారు.
– ఉప్పు రమేశ్, గండివేట్, గాంధారి
మా ఊరిలోని కెనరా బ్యాంకు లో రూ.42వేల పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. గతంలో కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు రూ.49 వేలు మాఫీ వచ్చింది. ఇప్పుడు రూ.42వేలు మాఫీ కాలేదు. ఎందుకు కాలేదో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.రెండు లక్షలలోపు లోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ మాఫీ చెయ్యాలే.
పొతంగల్, ఆగస్టు 4: నేను 2018సంవత్సరంలో రూ.17వేలు క్రాప్ లోన్ తీసుకున్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ వస్తున్న. రూ.లక్షలోపు రుణాలు ఉన్న వారికి మాఫీ వచ్చిందనగానే సంతోషపడ్డా. తీరా లిస్టు చూసేసరికి నా పేరే లేదు. అధికారులను అడిగితే రెండో విడుతలో వస్తుందని చెప్పారు. రెండో విడుత లిస్టులో కూడా నా పేరు రాకపోయే సరికి ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు.
పొతంగల్, ఆగస్టు 4: సీఎం రేవంత్రెడ్డి రూ.2లక్షల రుణమాఫీ చేస్తానంటే మస్తు ఖుషీ అ యిన. నాకు ఉన్న ఎకరం 6గుంట ల భూమికి 2018లో రూ.69 వేలు క్రాప్ లోన్ తీసుకున్న. అప్పటి నుంచి రెన్యువల్ చేస్తూ వస్తున్న. రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. అధికారులను అడిగితే ఏదో ఒక పొరపాటు ఉండొచ్చని చెప్పారు. రెండో విడుతలో కూడా నా పేరు రాలేదు.