BRS leaders demand | పోతంగల్, ఆగస్టు 29: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సుమారు మండలంలో 2వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని, ఈ బాధిత రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.40 వేలు ఇవ్వాలని బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, కామారెడ్డి మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి డిమాండ్ చేశారు.
మండలంలోని మంజీర పరివాహ ప్రాంతాల్లోనీ సుంకిని, హంగర్గ, కారేగాం, పోతంగల్ అయా గ్రామాలలో నీట మునిగిన పంటలు, మంజీరా నది ఉద్రితను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ప్రతీ ఎకరానికి ప్రభుత్వం రూ.40వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ అధికారులు పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేసి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్, నాయకులు మోరే కిషన్, వల్లేపల్లి శ్రీనివాస్ రావు, తేళ్ల రవికుమార్, ఏంఏ హకీం, ఆరీఫ్, మోరే గౌతమ్ కుమార్, ఏజాజ్, కప్ప సంతోష్, సమీర్, తేళ్ల అరవింద్, సాగర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.