Ankapur | ఆర్మూర్ టౌన్ : ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ రైతన్నలు యూరియా కోసం రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో జాతీయ రహదారి 63 పై రైతులు రాస్తారోకో చేశారు. రైతులకు యూరియా సరఫరా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ను వెంటనే తొలగించాలని, పాత పద్ధతిలో యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రైతులకు యూరియా యాప్ వాడడం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధర్నా చేయడంతో 30 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు.