Urea | సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడ గ్రామంలో సహకార సంఘం వద్ద యూరియా రైతులు రైతులు బారులు తీరారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు సహకార సంఘం వద్ద సోమవారం పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. కానీ అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన 10 నిమిషాలు తర్వాతే యూరియా అయిపోయిందని రైతులకు తెలిపారు.
దీంతో ఆగ్రహించిన అన్నదాతలు ప్రాథమిక సహకార సంఘం ముందు నిరసనకు దిగారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ పడగల రాజేశ్వరరావు మద్దతు తెలిపి ఏవో ప్రజాప్రతితో మాట్లాడారు. కౌంటర్లను పెంచి రైతులకు సులభంగా యూరియా పంపిణీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.