నిలిచిన పసుపు కొనుగోళ్లు
నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్కు తెచ్చిన పసుపు పం ట యార్డులో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని అధికారులను నిలదీశారు. రైతులందరూ ఒకేసారి కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో అక్కడ తోపులాట జరిగింది.
- మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగిన రైతులు
- కార్యాలయంలోకి దూసుకెళ్లిన అన్నదాతలు
- పగిలిన కార్యాలయ అద్దాలు
కంఠేశ్వర్, ఫిబ్రవరి 26: నిజామాబాద్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్కు తెచ్చిన పసుపు పం ట యార్డులో పేరుకుపోయింది. దీంతో కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని అధికారులను నిలదీశారు. రైతులందరూ ఒకేసారి కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో అక్కడ తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో మార్కెట్ కమిటీ కార్యాలయ అద్దా లు ధ్వంసమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
మూడు రోజులు గా ఈ-నామ్ దరఖాస్తు పనిచేయకపోవడంతో ప సుపు కొనుగోళ్లకు అంతరాయం ఏర్పడింది. పసు పు కొనుగోళ్లకు సంబంధించి ఈ-నామ్ ఆన్లైన్ దరఖాస్తు 1.0 నుంచి 2.0కు అప్గ్రేడ్ కావడంతో అది పనిచేయడం లేదు. దీంతో కొనుగోళ్లు స్తంభించాయి. ఈ విషయమై స్థానిక అధికారులు ఉన్నతా ధికారులను సంప్రదించగా.. వారం రోజులపాటు పాత దరఖాస్తులు ఉపయోగించాలని సూచించారు. దానికి అనుగుణంగా అనుమతులు ఇవ్వకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు..
మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, పసుపు కొనుగోలు చేయకపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీంతో గురువారం ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. నిలిచిపోయిన పసుపు కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు
నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం వరకు ఈ నామ్ 1.0లో క్రయ విక్రయాలు జరిపామని, అయితే, 25 నుంచి ఈ నామ్ 2.0 వర్షన్ అప్డేట్ చేయడం, ఈ నామ్ 1.0 నిలిపి వేయడంతో సాంకేతిక కారణాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో పసుపు కొనుగోళ్లలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ నామ్ 1.0ను పునఃప్రారంభించాలని కేంద్రాన్ని కోరగా ఆమోదించినప్పటికీ, గురువారం ఉదయం వరకూ అది పని చేయలేదన్నారు. అప్పటికే భారీగా పసుపు రావడంతో రైతుల శ్రేయస్సు దృష్ట్యా బహిరంగ వేలం ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

