పోక్సో కేసులో కానిస్టేబుల్ అరెస్టు
బాలికను లైంగికంగా వేధించిన ఓ కానిస్టేబుల్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ పట్టణానికి చెందిన ఆరోతరగతి విద్యార్థిని ఈ నెల 11న సైకిల్‌పై వెళ్తుండగా ఓ వ్యక్తి అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
నీలగిరి, జూలై 20: బాలికను లైంగికంగా వేధించిన ఓ కానిస్టేబుల్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ పట్టణానికి చెందిన ఆరోతరగతి విద్యార్థిని ఈ నెల 11న సైకిల్‌పై వెళ్తుండగా ఓ వ్యక్తి అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాల కోసం ప్రయత్నించారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితుడు గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పుల్లెంల సత్యనారాయణగా గుర్తించారు. ఈ నెల 17న అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు తరలించడంతో పోలీస్ అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.
ఇంకా చదవల్సిన వార్తలు
16 ఏండ్ల బాలికపై లైంగికదాడి ; యువకుడిపై పోక్సో కేసు
అశ్వారావుపేట, జూలై 20 : ఇంటివద్ద డ్రాప్ చేస్తానని నమ్మించి బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఆదివారం చోటుచేసుకున్నది. దమ్మపేట మండలానికి చెందిన 16 ఏండ్ల బాలిక అశ్వారావుపేట మండలం ఉసిర్లగూడెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ.. అశ్వారావుపేటలోని ఒక దుకాణంలో పనిచేస్తున్నది. ఆదివారం సాయంత్రం ఉసిర్లగూడెం వెళ్లడానికి అశ్వారావుపేటలో వేచిచూస్తున్న బాలికను కోర్సా సంతోష్ ఇంటివద్ద డ్రాప్ చేస్తానని చెప్పి బైక్‌పై ఎక్కించుకున్నాడు. పాత మామిళ్లవారిగూడెం శివారుకు చేరుకోగానే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అశ్వారావుపేట ఎస్సై యయాతి రాజు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

