బాన్సువాడ రూరల్, జూన్ 15 : మండలంలోని పలు గ్రామాల్లో కోతులు పంటలపై దాడులు చేస్తున్నాయి. వానకాలం పంటల సాగు కోసం రైతులు సిద్ధం చేసుకుంటున్న నారుమళ్లను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానర దండు నారుమడుల్లో నారును పెకిలించి నష్టం కలిగిస్తున్నాయి.
కోతు ల బెడదను నివారించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఉదయం గ్రామాల్లో ఉంటున్న కోతులు మధ్నాహ్న సమయంలో పొలాల్లోకి వచ్చి నారుమడులను ధ్వంసం చేస్తున్నాయి.