Urea App | కామారెడ్డి : యూరియా యాప్ ఎత్తేయాలని రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రైతు వేదిక వద్ద యూరియా యాప్ ను ఎత్తివేయాలని కోరుతూ దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు చేపట్టారు. రైతు ప్రభుత్వం అని చెప్ప కునే దగుల్బాజీ ప్రభుత్వాం రైతులకు ఇబ్బంది అయ్యే విధంగా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి యూరియా యాప్ ను తక్షణమే రద్దు చేయాలని నిరసిస్తూ వాళ్లు ధర్నా నిర్వహించారు.
అనంతరం రైతులు మాట్లాడుతూ తాము నిరక్షరాశులం కావున మాకు యాప్ లో బుక్ యూరియా మసాలా బుక్ చేయడం అవగాహన లేకపోవడం, అంతటి విలువైన స్మార్ట్ఫోన్లు లేకపోవడం వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని, కావున ప్రభుత్వం తక్షణమే పాత పద్ధతిలో రైతు పట్టా పాస్ బుక్కుల ద్వారా యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు తిరుపతి, నాయకులు టంకర్ రవి, వార్డ్ మెంబర్స్ టంకరి రాజేందర్, సుతారి సురేష్, పోతుల లింగారెడ్డి, గూగుల్ తండా సీనియర్ నాయకుడు లింబాద్రి, ఆనంద్, తెండు రవి, బుధం బార్లాజ్, బండి రాములు, బండి పెంటయ్య, కురుమ బాలమల్లు, మేటర్ లింగం, రైతులు తదితరులు పాల్గొన్నారు.