భిక్కనూరు, నవంబర్ 4: కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంటాలో, తేమ శాతం కొలిచే యంత్రంలో తేడాలు ఉన్నాయని భిక్కనూరు మండలం అంతంపల్లి సింగిల్ విండో ఆవరణలో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
తేమ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నదని సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏడీఏ అపర్ణ, ఏవో రాధారెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. తేమ శాతా న్ని కొలిచే మరో యంత్రాన్ని తెప్పించా రు. అలాగే, తూనికలు, కొలతల శాఖ అధికారులతో మంగళవారం రైతుల సమక్షంలోనే కాంటాలను సర్టిఫైడ్ చేయిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.