Bonus payment | పోతంగల్, జూన్10: రైతులకు బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు హన్మండ్లు మాట్లాడుతూ అధికారం కోసమే ప్రభుత్వం పథకాలను తీసుకవచ్చారే తప్ప అమలు చేయడం లేదని మండిపడ్డారు. సన్న రకం ధాన్యంతో పాటు అన్ని రకాల ధాన్యానికి రూ. 500 బోనస్ వెంటనే ఇవ్వాలని, వానాకాలం పెట్టుబడి కోసం రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మక్కయ్య, గంగారం, నాగనాథ్, మోహన్, నాగభూషణం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.