నవీపేట, నవంబర్ 20: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్‌తో మూడు గుంటల భూమి కూడా తడువది. ప్రస్తుతం 24గంటల పాటు త్రీఫేస్ కరెంట్ వస్తున్నది. దీంతో పుష్కలంగా పంటలు పండిస్తూ రైతులు సంతోషంగా ఉన్నారు. మూడు గంటల కరెంట్‌తో మళ్లీ పాత రోజులు తెస్తారా? రేవంత్‌రెడ్డి అధికారంలోకి రావడానికి రైతులను మభ్యపెడుతున్నాడు. రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి, కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి రైతుల నుంచి గుణపాఠం తప్పదు.
శక్కర్‌నగర్, నవంబర్ 20: 10హెచ్‌పీ బోర్సే కుఛ్ ఫాయిదా నహీహోతా.. (కాంగ్రెస్ రైతులకు చెప్పిన విధంగా 10 హెచ్‌పీ మోటర్లు ఎందుకు పనికిరావు) రైతులకు బోరు నీటితో అవసరాలు తగ్గాయి. బోర్ల వినియోగం కూడా తగ్గింది. ప్రజలను మభ్యపెట్టేందుకు 10హెచ్‌పీ బోర్లు వేసుకోవాలని చెప్పడం సరైంది కాదు. గతంలో బోర్లను విరివిగా ఉపయోగించే రైతులు, విద్యుత్ సరఫరా మెరుగుపడడం, చెరువులు, నిజాంసాగర్ కాలువల ద్వారా నీరు సరఫరా కావడంతో బోర్లతో పనితప్పింది. 10హెచ్‌పీ మోటర్లతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, విద్యుత్ సంస్కరణలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మా వద్ద గతంలో రైతులు మోటర్ల రిపేర్ల కోసం గంటల తరబడి, రోజుల తరబడి వేచిచూసే వారు. మాకు కూడా పనిచాలా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా మెరుగుపడడంతో మోటర్లు రిపేర్‌కు రావడం లేదు. మాకు పనులు తగ్గినా, రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఇప్పుడున్న మోటర్లను 10హెచ్పీలుగా మారిస్తే రైతులు అన్ని రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం వినియోగిస్తున్న 5హెచ్‌పీ, 6 హెచ్‌పీ మోటర్లు పంటలకు సాగునీరందించేందుకు సరిపోతాయి. వీటి ఖరీదుతో పోలిస్తే 10 హెచ్‌పీ మోటర్ల ఖరీదు, వాటి మరమ్మతులకు సైతం రెండింతలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. రైతులు ఈ విషయంలో సుదీర్ఘంగానే ఆలోచిస్తారు తప్ప.. ఈ మోటర్ల వినియోగానికి ముందుకు రారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మరు. రైతులకు నష్టం జరిగే అంశంపై యోచిస్తున్నారు. మా అనుభవం ప్రకారం రైతులకు 10హెచ్‌పీ మోటర్లు ఎందుకూ పనికిరావు. వీటి వినియోగంతో అదనంగా పొందే ప్రయోజనం ఏమీ ఉండదు.
శక్కర్‌నగర్, నవంబర్ 20: సాధ్యం కాని.. అనాలోచిత హామీలతో కాంగ్రెస్ నేతలు రైతులను అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు పొలాల్లో వినియోగించడం సాధ్యం కానేకాదు. ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు, రైతులకు ఉన్న సాగుభూములకు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న 5హెచ్‌పీ బోరు మోటార్లతో నీటి సరఫరా మెరుగ్గానే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు 10 హెచ్‌పీ మోటర్లు, 3గంటల విద్యుత్ సరఫరా అంటే మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లాల్సి వస్తుందేమో యోచించాలి. ఎక్కడ కూడా ఈ మోటర్ల బిగింపు అనేది సాధ్యం కాదు. రైతులు కూడా ఇందుకు సానుకూలంగా ఉండరు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలతో ఎలాంటి సమస్యలు లేవు. సాధ్యం కాని, అనాలోచిత హామీలు ఇచ్చి రైతులను గందరగోళానికి గురిచేయవద్దు.
బోధన్ రూరల్, నవంబర్ 20: వ్యవసాయంపై కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో తెల్వక పోతుండె. దీంతో బోరు మోటరు దగ్గర రాత్రింబవళ్లు పడిగాపులు కాశాం. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ మంచిగిస్తున్నారు. కాంగ్రెసోళ్లు ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని చెబుతున్నారు. 10హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలని అంటున్నారు. మళ్లోసారి కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే మా బతుకులు ఆగం చేసేటట్లు ఉన్నారు. ఇలాంటోళ్లకు అధికారం ఇచ్చే అవకాశమే లేదు.
బోధన్ రూరల్, నవంబర్ 20: కాంగ్రెస్ నాయకులు 10హెచ్‌పీ మోటర్లు, మూడు గంటల కరెంట్ అంటున్నారు. వీళ్ల మాటలు వింటే రైతులంతా ఇబ్బండి పడే అవకాశం ఉన్నది. సీఎం కేసీఆర్ అధికారంలో వచ్చినప్పటి నుంచి రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్నారు. ఎలాంటి రంది లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎప్పుడు వెళ్లినా పొలంలో బోరు మోటరు చాలు చేసుకుంటున్నాం. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవడం మాతోని సాధ్యం కాదు. ఖర్చు కూడా పెరుగుతది. 10హెచ్‌పీ మోటర్లతో కరెంటు సమస్య వస్తుందని చెబుతున్నారు. అటుపోయి.. ఇటుపోయి కాంగ్రెసోళ్లు మా రైతులను ఆగం చేసే కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా రైతులకు మళ్లీ కష్టాలు తప్పవు. అందుకే వాళ్లను అధికారంలోకి తెచ్చే ప్రసక్తే లేదు.
బోధన్ రూరల్, నవంబర్ 20: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేకపోవడంతోనే ఈ రకంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ హయాంలో రాత్రిపూట కరెంట్‌తో చాలా ఇబ్బందిపడ్డాం. పాములు, తేళ్లు కరిచి రైతులు చనిపోయారు. బావికాడికి పోతే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు. పంటలు ఎండిపోయేవి. రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్ సరిపోతుందని అంటుండు. మూడు గంటల కరెంటుతో ఒక మడి కూడా సరిగా పారదు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయం తెల్వదు. కేసీఆర్ ఎవుసం చేసినోడు కాబట్టి రైతులకు బాధలు లేకుండా చేశాడు. 10హెచ్‌పీ మోటర్లను పొలంలో బోర్లకు ఉపయోగించాలని చెబుతున్న రేవంత్‌కు ఏమాత్రం తెలివి ఉందో అర్థం అవుతున్నది. ఇన్నేండ్లు ఎవుసం చేస్తున్న మాకు తెల్వదా? ఇప్పుడున్న మోటర్లతో మాకేమైనా ఇబ్బంది అవుతుందని ఆయనకు చెప్పినామా? నాణ్యమైన కరెంటు ఇస్తూ 24 గంటలు బోర్లు పారేటట్లు చేసిన సీఎం కేసీఆర్‌నే గెలిపించుకుంటాం.
నవీపేట,నవంబర్ 20: వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటర్ ఎంతమాత్రం ఉపయోగపడదు. ప్రస్తుతం భూమిలోనుంచి రెండు, రెండున్నర ఇంచుల కన్నా ఎక్కువ నీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ నీటిని తోడేందుకు 5హెచ్‌పీ మోటర్ అవసరం. గోదావరి నది, చెరువులు, వాగుల్లో ఉన్న నీటిని తీసేందుకే 10 హెచ్‌పీ మోటర్ అవసరం ఉంటుంది. 10హెచ్‌పీ మోటర్ వినియోగించాలంటే ఖర్చుతో కూడిన పని. ఈ మోటర్ వినియోగంతో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. రేవంత్‌రెడ్డి తెలిసి మాట్లాడుతుండో.. తెల్వక మాట్లాడుతుండో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ..రైతులకు కరెంట్ కష్టాలు రెట్టింపు అవుతాయి.
శక్కర్‌నగర్, నవంబర్ 20: కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు మూడు గంటల విద్యుత్ సరఫరా, 10 హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేసుకోవచ్చని అర్ధరహితంగా మాట్లాడడం సరైంది కాదు. రైతులు ఇటీవల వ్యవసాయంపై మంచి అవగాహన పెంచుకున్నారు. తెలంగాణ సర్కారు అందించిన విద్యుత్, నీటి సౌకర్యంతో పంటలను పుష్కలంగా పండిస్తున్నారు. నేను 30 ఏండ్లుగా వ్యవసాయం చేస్తూ, పలుమార్లు ఆదర్శ మహిళా రైతుగా పురస్కారాలు, అవార్డులు తీసుకున్నాను. నాకున్న అనుభవంలో ఈ వాగ్ధానం రైతులను ఇబ్బంది పెట్టడమే. కాంగ్రెస్ నాయకులకు రైతుల సంక్షేమం, సమస్యలపై ఎంత అవగాహన ఉందనేది తెలుస్తోంది. ఇలాంటి పనికిమాలిన వాగ్ధానాలు చేసి రైతులను గందరగోళ పరిస్థితిలోకి నెట్టవద్దు. రైతులను దెబ్బకొట్టడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నది.