కోటగిరి, మార్చి 18 : యాసంగి పంటల సాగులో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీరందక పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నా రు. కోటగిరి మండల జైనాపూర్ చివరి ఆయకట్టు కింది రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కండ్ల ముందే పంట ఎండిపోతుండడం ఆవేదనకు గురిచేస్తున్నది. ముదురుతున్న ఎండలకు బోరు బావులు వట్టిపోయి చుక్కనీరూ పోయడంలేదు. కనీసం నిజాంసాగర్ కాలువ ద్వారానైనా చివరి తడి అందించి పంటను కాపాడుకుందామంటే చివరి ఆయకట్టు వరకూ నీళ్లు అందడంలేదు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటు తున్నాయి.
ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు పంటలకు సాగు నీరందక ఎండిపోతున్నాయని రైతులు కంటతడి పెడుతున్నారు. నిజాంసాగర్ డీ -28, 1 కెనాల్ ద్వారా నీటిని విడుదల చే శారు కానీ, చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. కోటగిరి మండ లం జైనాపూర్ శివారులో సుమారు 400 ఎకరాలు వరి పంటకు ‘సాగర్’ నీరు అందడం లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొలంలో నీళ్లు లేక నేల నెర్రెలు బారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటలను సాగు చేశామని, పంట పొట్ట దశలో ఉన్న సమయంలో నీళ్లు అందక పంట తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని వాపోతున్నారు. ముఖ్యంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఐదెకరాల్లో వరి సాగు చేసిన. నిజాంసాగర్ కాలువ నీరు పంటకు అందకపోవడంతో కండ్లముం దే పంట ఎండిపోతున్నది. నీరు లేక భూమి నెర్రెలు బారింది. కాలువ నీటిని వదిలినా చుక్క నీరు కూడా పంటకు అందడం లేదు. అధికారులు స్పందించి నీరు అందించాలి.
ప్రస్తుతం వరి పంట గింజ కట్టే దశలో ఉన్నది. మరో తడి అందితే పంట కోత కు వస్తున్నది. కానీ ప్రస్తుతం విడుదల చేసిన కాలువ నీరు చివరి ఆయకట్టు వరకు అందడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలా లు అడుగంటడంతో బోరు నీరు సరిపోవడం లేదు. నిజాంసాగర్ నీటిపై అధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు.