కామారెడ్డి : రోగులను పట్టిపీడిస్తున్న క్యాన్సర్‌ను ( Cancer ) అరికట్టాలంటే అవగాహన ముఖ్యమని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ స్టేడియంలో పద్మపాణి సొసైటీ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సహాయం చేసేందుకు ఆదివారం హాఫ్ మారథాన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ హాఫ్ మారథాన్‌లో ( Half marathon ) 5 కిలోమీటర్లు ,10కె, 21 కి.మీ రన్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ లక్షణాలు ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించి సూచనలు పాటిస్తే కొంత మేర ఉపసమశనం దొరుకుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. నిర్వాహకులు సత్యనారాయణరెడ్డి, డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, పున్నా రాజేష్, జైపాల్ రెడ్డి, దత్తాద్రి, నవీన్ కుమార్, అనిల్‌కుమార్, శివకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మారథాన్‌లో గెలిచిన విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు.