మోర్తాడ్/బాల్కొండ/వేల్పూర్, ఆర్మూర్‌టౌన్/నవీపేట/ కోటగిరి, జూలై11: ప్రతి ఒక్కరూ మొక్కలను వాటిని సంరక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే అధికారులు, నాయకులతో కలిసి గురువారం మొక్కలను నాటారు. ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలను నర్సరీల్లో పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామంలో మహిళాసంఘాల సభ్యులకు ఎంపీవో సదాశివ్ మొక్కలను పంపిణీ చేశారు. జీపీ కార్యదర్శి నవీన్‌గౌడ్, సీసీ శ్రీనివాస్, సీఏ బాలమణి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్‌లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మిక వృత్తి పరిరక్షణ కోసం ఎస్సారెస్పీకి చెందిన వరదకాలువ గట్టుపై 500 ఈత మొక్కలను నాటారు.
ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై గంగాధర్, ఈజీఎస్ ఏపీవో ఇందిరా, జీపీ కార్యదర్శి శ్రీధర్, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు అమర్నాథ్గౌడ్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇండ్ల పరిసరాల్లో మొక్కలు నాటాలని మండల ప్రత్యేకాధికారిణి కృష్ణవేణి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటింటికీ మూడు మొక్కల చొప్పు అందజేసి మాట్లాడారు. అక్లూర్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు తనిఖీ చేశారు. అమీనాపూర్‌లో పల్లెప్రకృతి వనం పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలకిషన్, ఏపీవో అశోక్, టెక్నికల్ అసిస్టెంట్లు స్వరూప, శ్రీను, సుఖేశ్, పంచాయతీ కార్యదర్శులు వినోద్, అరుణ్, విపుల్, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రీకాంత్, రాజేశ్వర్, గంగాధర్ పాల్గొన్నారు. నవీపేట మండలంలోని నాగేపూర్ జీపీ కార్యాలయ ఆవరణలో మొక్కలను పంపిణీ చేశారు. కార్యాలయ ఆవరణలో ఎంపీవో రామకృష్ణ, ఏపీవో సంజీవ్, కార్యదర్శి మనోహర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ గంగారాం, జీపీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది గ్రామ మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని యాద్గార్పూర్లో, చెరువు కట్టపై మొక్కలను నాటారు. ప్రతి పంచాయతీకి 4,120 మొక్కలు లక్ష్యంగా నిర్ణయించినట్లు ఎంపీడీవో మనోహర్‌రెడ్డి తెలిపారు. మండలంలో 1,15,360 మొక్కలు నాటేందకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునంద, టెక్నికల్ అసిస్టెంట్ జగదీశ్, ఫీల్డ్ అసిస్టెంట్ సరోజ, కారోబార్ జాకీర్ పాల్గొన్నారు.