Heart Attack | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఎత్తోండ గ్రామానికి చెందిన హరికృష్ణ 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య ఇద్దరు పాప లతో కలిసి శనివారం ఓ సరస్సుకు బోటింగ్ వెళ్ళాడు.
అదే సమయంలో ఒక్క సారిగా హరికృష్ణకు గుండెపోటు రావడంతో సరస్సులో పడిపోయాడు. గమనించిన తన స్నేహితుడి కుమార్తె సరస్సులోకి దిగి హరికృష్ణ పైకి తీసుకొచ్చింది. గుండెపోటు గురైన హరికృష్ణకు సీపీఆర్ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. హరికృష్ణకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.