ఖలీల్‌వాడి/ వినాయక్‌నగర్/ డిచ్పల్లి / రుద్రూర్/ సారంగపూర్/ బోధన్, / మోర్తాడ్/ ఏర్గట్ల/ భీమ్‌గల్/ రెంజల్/ ఆర్మూర్‌టౌన్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. పర్యావరణ సంరక్షణ ఆవశ్యతను వైద్యసిబ్బంది ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యంతోనే వ్యాధులు విజృంభిస్తున్నాయని, ప్రతిఒక్కరూ పర్యావరణ సంరక్షణకు కృషిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో దుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వైద్య సిబ్బంది ప్రధానవీధుల గుండా ర్యాలీ నిర్వహించి పర్యావరణ కాలుష్యంతో కలిగే అనర్థాను వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎపిడమాలజిస్ట్ వెంకటేశ్, జిల్లా ఆరోగ్య విద్యాబోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ మలేరియా అధికారి సలీం, ఆరోగ్య విస్తరణ అధికారులు వెంకట్ రవి, నాగరాజు, స్వామి, శ్రీనివాస్, గంగాధర్, శ్రీధర్, మలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో జడ్జి సునీత కుంచాల, లీగల్ సర్విస్ అథారిటి సెక్రటరి పద్మావతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, మాణిక్ రాజ్, వెంకటేశ్వర్, డీఎల్ఎఫ్సి పర్యవేక్షణ పురుషోత్తం గౌడ్ న్యాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. డిచ్‌పల్లిలో ఎస్బీఐ, ఆర్ఎస్ఈటీఐ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, ఎస్బీఐ, ఆర్ఎస్ఈటీఐ సిబ్బంది ఆధ్వర్యంలో ఆర్ఎస్ఈటీఐ నుంచి డిచ్పల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, రామకృష్ణ, నవీన్, రంజిత్, లక్ష్మణ్, రాజశేఖర్, రవి పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని రాయకూర్‌లో ఎంపీడీవో సురేశ్‌బాబు, ఏపీవో మనోహర్ ఉపాధిహామీ సిబ్బందితో కలిసి రాయకూర్ గ్రామ పంచాయతీ ఫారంపాండు వద్ద ఉపాధి హామీ కూలీలతో మొక్కలు నాటించారు. అనంతర పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు.
రూరల్ మండలంలోని మల్కాపూర్(ఎం)లో ఈజీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎంపీడీవో మధురిమ, ఏపీవో పద్మ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మొక్కల సంరక్షణకు కృషిచేయాలని కోరారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ఈజీఎస్ టీఏ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో ఐసీడీఎస్, ఆదర్శ యువతీ మహిళా మండలి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గోసం బస్తీ, కర్ణం కుంటలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సీడీపీవో జానకి, సూపర్వైజర్ రాధికా రాథోడ్ అంగన్వాడీల్లోని కార్యకర్తలు, తల్లిదండ్రులకు పారిశుద్ధ్యంపై వివరించారు. పరిశుభ్రపై ప్రతిజ్ఞ చేయించారు. ఆదర్శ మహిళా మండలి ఆధ్వర్యంలో మూడు వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, పరిశుభ్రత గురించి వివరించారు. కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు, పారాలీగల్ వలంటీర్ పద్మాసింగ్, సభ్యులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి ఉప్లూర్ గ్రామంలోని నల్లకుంట వద్ద ఎంపీడీవో రాజాశ్రీనివాస్ మొక్కలు నాటారు. వానకాలం ఆరంభమవుతున్నందున అందరూ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో విద్యానంద్, సిబ్బంది పాల్గొన్నారు. ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు మొక్కలు నాటారు. తాళ్లరాంపూర్ పల్లె దవఖాన ఆవరణలో మండల వైద్య రిపోర్టింగ్ అధికారి అకుల మారుతి గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమల్లో పంచాయతీ కార్యదర్శులు జాకీర్, భోజన్న, అకుల రవి, శ్రీకాంత్, భార్గవ్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పచ్చదనం పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా భీమ్‌గల్ మండలంలోని సికింద్రాపూర్‌లో అమృత సరోవర్ సైట్‌ను సందర్శించి మొక్కలు నాటారు. సంబంధిత సిబ్బందికి ఇంకుడు గుంతల నిర్మాణం మొక్కల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధంపై అవగాహన కల్పించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్‌కుమార్, ఉపాధిహామీ ఏపీవో నర్సయ్య, ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
రెంజల్ మండలంలోని దూపల్లి, సాటాపూర్ గ్రామాల్లో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో రమణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యవరణనాన్ని రక్షించాలని ఉపాధి హామీ కూలీలతో ఎంపీడీవో ప్రతిజ్ఞ చేయించారు. చెరువు గట్టుపై నాటిన మొక్కలు నాటారు. ఏపీవో రమణ, ఈసీ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ధనవేణి తెలిపారు. పర్యావరణాన్ని రక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శరణ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడిబజార్‌లో ప్రజా సేవకుడు కొట్టూర్ అశోక్ ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. జ్యూట్ బ్యాగులను పలవురికి అందజేశారు.