కంఠేశ్వర్, అక్టోబర్ 14 : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈ వారం అధికారులు డుమ్మా కొట్టడంతో కళ తప్పింది.
దసరా తర్వాత నిర్వహించిన ఈ కార్యక్రమానికి చాలా మంది అధికారులు హాజరు కాలేదు. దీంతో ప్రజావాణి బోసిపోయింది. ఈ వారం 51 ఫిర్యాదులు రాగా, త్వరితగతిన పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మకరంద్ ఆదేశించారు.