Geeta workers | కోటగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గీత కార్మికులకు ఉపాధి అవకాశం కలిగిందని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, రాంపూర్ సమీపంలో 2014లో నాటిన ఈత వనాన్నిజిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం సందర్శించారు. కల్లు గీసే చెట్లను పరిశీలించారు. మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయని, స్థానిక గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఐదు ఎకరాల భూమిలో ఇంత చెట్లను నాటామని, ఈరోజు వాటి నుండి కల్లు సేకరిస్తున్నామని వారు తెలిపారు.
చెట్టు నుండి వచ్చిన స్వచ్ఛమైన కల్లును విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కల్తీ కల్లు ను అరికట్టాలనే లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈత వనాలను పెంచడం జరిగిందన్నారు. జిల్లాలో 8లక్షల చెట్లు ఉన్నాయని ఇందులో 75 శాతం చెట్ల నుండి స్వచ్ఛమైన కల్లు వస్తుందని, ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు వస్తుందని కాబట్టి స్వచ్ఛమైన కల్లు తాగి గీత కార్మికుల వృత్తి ని పరీరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కరరావు, ఎస్సై జమీన్, టీసీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, విట్టల్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, అరుణ్ గౌడ్, అంజా గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.