బాన్సువాడ రూరల్ : బాన్సువాడ (Banswada) మండలంలోని బోర్లం క్యాంప్‌లో డ్వాక్రా (Dwakra) మహిళా గ్రామ సంఘం నూతన కార్యవర్గాన్ని (New committee) శుక్రవారం డ్వాక్రా మహిళల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సంఘం అధ్యక్షుడిగా బింగి మాధవి, ప్రధాన కార్యదర్శిగా సావిత్రి, ఉపాధ్యక్షురాలుగా పల్లె సత్యవ్వ, కోశాధికారిగా సంగెం విజయ, సహాయ కార్యదర్శిగా పల్లె గంగామణిని ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులతో ఎన్నికల అధికారి సాయిలు ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ సంఘం బలోపేతానికి సభ్యులందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ షాదుల్లా, వీఏఓ సంజీవులు, డ్వాక్రా మహిళలు నాగమణి, ఉమా, రాజేశ్వరి, ఫాతిమా, సావిత్రి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.