ఖలీల్‌వాడి, మార్చి 12 : ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ గ్రాంట్స్ వనరుల వినియోగ బాధ్యతలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర పథక సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌కు పంపిన ఉత్తర్వుల్లో నిజామాబాద్‌కు బదులుగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా తప్పుగా ఉన్నది. దీనిని విద్యాశాఖ సంచాలకులు చూసుకోకపోవడం గమనార్హం.