గాంధారి/రామారెడ్డి, డిసెంబర్ 12: సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.94 లక్షలతో చేపట్టే భవన నిర్మాణ పనులకు ఆయ న సోమవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులతో భవనాలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, సర్పంచ్ మమ్మాయి సంజీవ్, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ముస్తాఫా, విండో మాజీ చైర్మన్ ముకుంద్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పెద్దబూరి సత్యం, విండో డైరెక్టర్లు తాడ్వాయి సంతోష్, బెజుగం సంతోష్, ఎస్ఎంసీ చైర్మన్ కమ్మరి స్వామి, ఉప సర్పంచ్ రమేశ్ ఉన్నారు.
బీజేపీ మతతత్వ రాజకీయాలు మానుకోవాలి
బీజేపీ మతతత్వ రాజకీయాలను మానుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో రూ.56లక్షలతో చేపట్టే సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ పనులకు సోమవారం శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కాలినడకన తిరుగు తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రామారెడ్డిలో రైతు చింతలకింది లింగం మరణించగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ నారెడ్డి దశరత్‌రెడ్డి, ఇసన్నపల్లి సర్పంచ్ కందూరి బాలమణీ లింబాద్రి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు రవీందర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, పీఆర్ డీఈ దయానంద్, ఎంపీడీవో విజయ్‌కూమార్, రామారెడ్డి సర్పంచ్ సంజీవ్, డీసీఎంఎస్ చెర్మన్ కపిల్‌రెడ్డి, రెతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కాసర్ల రాజేందర్, కాలభైరవస్వామి ఆలయ కమిటీ మాజీ చెర్మన్ సతీశ్గుప్తా, ఉప సర్పంచులు బంటు రాజేంధర్, పోతునూరి ప్రసాద్, గొర్రె శంకర్ తదితరులు పాల్గొన్నారు.