Yellamma | బలగం ఫేమ్ వేణు యెల్డండి వేణు యెల్డండి (Venu Yeldandi) రెండో చిత్రం కో సం నిరీక్షిస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. సంక్రాంతి కానుకుగా ‘ఎల్లమ్మ'(Yellamma) ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రంతో రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ గ్లింప్స్‌తో డీఎస్పీ ‘పర్షి’ పాత్రలో కనిపస్తారని డైరెక్టర్ రివీల్ చేశారు. దాంతో.. మాస్ లుక్‌తో కనిపిస్తున్న రాక్‌స్టార్‌కు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతున్నారు పలువురు సినీ ప్రముఖులు.
“ఎల్లమ్మ” సినిమాకు మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత నితిన్‌కి అవకాశం దక్కినప్పటికీ, నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించినప్పటికీ, అతనూ ఆ పాత్రను స్వీకరించలేదు. ఇంతలోనే అనుకోకుండా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ పేరు హీరోగా ఖరారైంది.
Presenting Rockstar @ThisisDSP who has always rocked your hearts with blockbuster music now in a new avatar 🥁#Yellamma Glimpse out now 🔥#YellammaGlimpse ▶️ https://t.co/qMF508pTbo#SVC61#DilRaju #Shirish @svc_official @Tseries @tseriessouth @dopvenu pic.twitter.com/00SV398RT5
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) January 15, 2026
దాంతో.. ఇన్నాళ్లు తన సంగీతంతో అలరించిన రాక్‌స్టార్ ఈసారి హీరోగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేయాలనుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా దర్శకుడు వేణు విడుదల చేసిన ఎల్లమ్మ ఫస్ట్ గ్లింప్ సినిమాపై హైప్‌ను పెంచేసింది.